పేజీలు

25 జనవరి 2013

ఇంటి అలంకరణా కళే...

ఇంటి అలంకరణా కళే...
నగరాలలో అగ్గిపెట్టెల వంటి గదులున్న ఇళ్ళలో జీవనం సాగించడం సర్వసాధారణం అయిపోయింది. కనీసం గజం జాగా దొరకని పరిస్థితుల్లో ఉన్న చోటుతోనే సరిపెట్టుకొని జీవించాల్సి వస్తున్నది. అంత చిన్న గదులలోని వసిస్తున్నా అవి విశాలంగా కనుపించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం మరీ ఇరుక్కుని ఉంటున్న భావన కలుగదు. అంతేకాదు మనసుకు కూడా హాయిగా ఉంటుంది.

          ఇంటిని విశాలంగా ఉన్నట్టు తీర్చిదిద్దుకోవడానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వాటిని పా టిస్తే మనం అగ్గిపెట్టెల్లో నివసిస్తున్నామనే భావ న కలుగదు. అవేంటో చూద్దాం..నేల కనిపించాలి.. మనకు గదిలో నేల ఎం త ఎక్కువగా కనిపిస్తే గది అంత విశాలంగా ఉన్నట్టుతోస్తుంది. అలా ఉండ డం కోసం గది లో ఫర్నిచర్‌ను గోడలకు పెట్టడం ఒక మా ర్గం. తద్వారా అటూ ఇటూ తిరిగేందుకు చో టు విశాలంగా ఉంటుంది. గ ది ఒక మాదిరి పెద్దగా ఉంటే సోఫా వంటి ఫ ర్నిచర్‌ను ఒక కో ణంలో పెట్టడం ద్వారా ఆ గ ది పొడుగ్గా ఉన్న భావన కలుగుతుంది. అంతేకాదు, ఒక మూ ల చోటును సృష్టించినట్టవుతుంది. ఫర్నిచర్‌ను ఎంచుకునేటప్పుడు.. ఫర్నిచర్‌ను ఎంచుకునేటప్పుడు అది బహువిధాలుగా పనికి వచ్చేలా ఉండేదిగా చూసుకోండి.


    టివి స్టాండ్‌ తీసుకునేటప్పుడు సొరుగులు ఉ న్న దానిని తీసుకుంటే డివిడిలు, పుస్తకాలు వా టిలో దాచవచ్చు. అలాగే సోఫా కం బెడ్‌ వంటి వాటిని ఎంచుకోవడం వల్ల అవి బహుళార్థ ప్ర యోజనాలను ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లలో బహుళార్థ ప్రయోజనాలనిచ్చే బెంచిలు దొరుకుతున్నాయి. స్టోర్‌ చేసుకునేందుకు, కాఫీ టేబుల్‌గా ఉపయోగించేందుకు, అదనంగా కూర్చోవడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటున్నాయి. స్టైల్‌గా కనిపించే ఒక్క పీస్‌లోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయి.తలుపులను, గోడలను ఉపయోగించాలి... గదిలో ఎక్కడ పడితే అక్కడ పేపర్లు, చెప్పులు వంటివి పెట్టుకోవడం వల్ల కిక్కిరిసినట్టుగా కనుపిస్తుంది. కనుక గోడకు ఫిక్స్‌ చేసుకునే షూరాక్‌లను, మ్యాగజైన్‌ రాక్‌లను పెట్టుకోవడం వల్ల వాటన్నింటినీ గోడల మీదకి ఎక్కించేయవచ్చు. తద్వారా గదిలో చోటు ఏర్పడుతుంది.

      ఒకటే రంగు ఉపయోగించాలి.. గదిలో పె యింటింగ్‌ వేసేటప్పుడు రెండు మూడు రంగులను ఉపయోగించడం కన్నా ఒకటే రంగును ఉపయోగించడం మంచిది. సాధ్యమైనంతవర కూ లేతరంగులను వేసి, అదే రంగులలో ఫర్నిచర్‌ను తీసుకోవడం వల్ల గది విశాలంగా ఉన్న ట్టు కనపడుతుంది. లేతరంగు గోడలకు వేసి ముదురు రంగు ఫర్నిచర్‌ వాడితే అవి కొట్టచ్చినట్టుగా కనిపిస్తూ గదిలో చోటును మింగేసిన ట్టుంటాయి. అలాగే కిటికీల నుంచి సాధ్యమైన ంత వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.గదిలో వెలుతురు ఉండాలి.. సహజమైన వె లుతురు అయినా బల్బుల ద్వారా వచ్చే వెలుగై నా వెంటిలేషన్‌ బాగా ఉన్న గదులు పెద్దగా ఉ న్న భావనను కలిగిస్తాయి. వెంటిలేషన్‌ తక్కువగా ఉంటే విద్యుత్‌ లైట్లతోనే గది బ్రైట్‌గా ఉం డేలా చేసుకోవచ్చు. అందం కోసం రకరకాల లాంప్‌ షేడ్లు మనకు మార్కెట్లు లభ్యం అవుతున్నాయి.కాంతి ప్రతిఫలించేలా చూసుకోవాలి.. కాంతిని ప్రతిఫలింప చేసేవి అద్దాలు. కనుక లైటు అమర్చిన చోటుకు అభిముఖంగా అద్దా న్ని అమర్చుకోవడం వల్ల కాంతి దానిపై పడి ప్రతిఫలించి గదిలో మరింత వెలుతురు నింపుతుంది.

        కప్పుకు ముదురు రంగులు వద్దు... గదులు చిన్నగా ఉన్నప్పుడు కప్పుకు ముదురు రంగులు వేస్తే అవి మరింత చిన్నగా కనిపిస్తాయి. అంతకన్నా తెలుపు రంగు వేయడం వల్ల కప్పు ఎత్తుగా ఉన్న భావన రావడమే కా కుండా గదులు కాంతివంతంగా కనిపిస్తాయి. లేత క్రీమ్‌ లేదా నీలం రంగులు కూడా గదు లు విశాలంగా ఉన్న భావనను కలిగిస్తాయి.బెడ్‌ రూం... బెడ్‌రూంలు చిన్నగా ఉన్నప్పు డు కూడా పైన చెప్పిన సూత్రాలే వర్తిస్తాయి. ముఖ్యంగా ఆ గది విశ్రాంతి పొందేందుకు ఉ ద్దేశించిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని అ క్కడ అనవసర ఫర్నిచర్‌ చేర్చకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ వార్డ్‌రోబ్స్‌ వంటివి గోడలకే ఫిట్‌ చేయించుకోవడం మంచిది. అలాగే డ్రెస్సింగ్‌ టేబుల్‌ పెట్టి ఉన్న చోటును మింగేయకుండా గోడలకు అద్దాలను బిగించడం వల్ల గది కాస్త విశాలంగా ఉన్నట్టు కనుపిస్తుంది. అలాగే మంచంకన్నా పెద్దగా ఉండే వస్తువు ఏదీ ఆ గదిలో ఉండకూడదన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని దానిని సర్దుకోవాలి. బెడ్‌రూంలో గోడలకు అన్నీ తగిలించడం వల్ల కూడా గది చిన్నగా అనిపించే అవకాశమున్నందున గది గోడలను కూడా సాధ్యమైనంత ఖాళీగా ఉంచడం మంచిది.

      డైనింగ్‌ రూం... డైనింగ్‌ రూం పెద్దగా కనిపించాలంటే చేయాల్సింది టేబుల్‌ సైజ్‌ను చిన్నదిగా ఉంచడమే. చిన్న డైనింగ్‌ టేబుల్‌ లేదా మడిచిపెట్టుకునే అవకాశం ఉన్నదానిని ఉపయోగించడం వల్ల మాత్రమే ఆ గది విశాలం గా కనిపించగలదు. అలాగే మూల అల్మరాలో గాజు సామాన్లు పెట్టుకోవడం, అలాగే జాడీలు వంటి వాటిని పెట్టుకోవడం వల్ల గది ఇరుకుగా కనిపించదు.వంటగది.. వంటగది విశాలంగా కనిపించాలంటే ఆ గదిలో అల్మరాలు గోడలోపలకు పె ట్టుకోవడం సరైనది. తద్వారా అన్ని వస్తువుల ను వాటిలో పెట్టుకోవచ్చు. ఫ్రిజ్‌. ఒవెన్‌ వంటి వి కూడా పెట్టుకునేందుకు గోడలోనే అరలుగా ఏర్పరిస్తే గది విశాలంగా కనిపిస్తుంది. అలాగే వంట గట్టు కింద అరలు పెట్టుకోవడం వల్ల కూడా గది చిందరవందరగా కనిపించకుండా ఉంటుంది. ఈ మొత్తంలో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు భారీ ఫర్నిచర్‌ను, అధిక వస్తువులను ఇంట్లో ఉంచుకోకపో వడం మంచిది. సాధ్యమైనంత ఉన్న స్థలాన్ని తెలివిగా ఉపయోగించుకోవడమొక్కటే దారి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి